కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా ఎంపిక

కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా ఎంపిక

 

— నిజాంసాగర్ పోలీస్ కానిస్టేబుల్ నేనవత్ కస్తూరి,కి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందనలు

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 28

 

 

 

నిజాంసాగర్ పోలీస్‌ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నేనవత్‌ కస్తూరి, తమ కృషి, పట్టుదలతో యువతకు ఆదర్శంగా నిలిచారు. ఉద్యోగ బాధ్యతల నడుమ కూడా విద్యపై ఆసక్తి కోల్పోకుండా, నిరంతర అభ్యాసంతో TSPSC నిర్వహించిన Extension Officer Grade–I (WD&CW Dept.) పరీక్షలో అర్హత సాధించడం విశేషం.

 

బాన్సువాడ మండలం బోర్గం క్యాంపు గ్రామానికి చెందిన కస్తూరి ఏక్లారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివి, అనంతరం వరంగల్‌లో ఇంటర్మీడియట్‌, కోటీ ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 2024లో పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా ఎంపికై, నిజాంసాగర్ పి.ఎస్‌లో సేవలు అందిస్తున్నారు.

 

విధుల్లో నిబద్ధతతో పాటు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS కస్తూరి ని అభినందిస్తూ మేమెంటోతో సత్కరించారు.

 

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ –

“పోలీస్‌ శాఖలో సేవలతో పాటు విద్య, అభ్యాసంలో ముందుకు సాగడం ఎంతో గర్వకారణం. భవిష్యత్తులో కూడా తన ప్రతిభతో మంచి పేరు సంపాదించి, ప్రజలకు సేవ చేస్తూ తనదైన ముద్రను వేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment