జాబ్ మేళాలో గజ్వేల్ విద్యార్థుల ఎంపిక
గజ్వేల్, 19 ఫిబ్రవరి 2025 : స్థానిక గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో బుధవారం నాడు జరిగిన జాబ్ మేళాకి విశేష స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ జాబ్ మేళాలను స్థానిక నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల టి.ఎస్.కె.సి., టి.ఏ.ఎస్.కె. మరియు ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ చెందిన చెందిన ఆక్సిస్ బ్యాంకు వారు పాల్గొనడం జరిగిందని, ఇందులో గజ్వేల్ పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు మరియు కళాశాలకు చెందిన విద్యార్థులు 150 మంది పాల్గొన్నారని తెలిపారు. ఈ మినీ జాబ్ మేళాలో 12 మంది కళాశాల విద్యార్థులు, 13 స్థానిక నిరుద్యోగ అభ్యర్థులు సంస్థలోని వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆక్సిస్ బ్యాంకు హెచ్.ఆర్. ప్రతినిధులు కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గణపతి రావు, టి.ఎస్.కె.సి. కోఆర్డినేటర్ డా. కవిత, ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ డి వెంకటేష్, అకడమిక్ కోఆర్డినేటర్ కెప్టెన్ డా. భవాని, ప్లేస్ మెంట్ అధికారి డా. విజయ భాస్కర్ రెడ్డి, టి.ఎస్.కె.సి. మెంటర్ జబ్బర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.