మానవ హక్కుల సంఘం మహిళా కమిటీ ఎంపిక..

మానవ హక్కుల సంఘం మహిళా కమిటీ ఎంపిక..

ఖమ్మం జిల్లా
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 23:

మానవ హక్కుల సంఘం మహిళా విభాగాన్ని జాతీయ చైర్మన్ శ్రీనివాసరావు ఎంపిక చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు , వేధింపులు మరియు పెరిగిపోతున్న మత్తు పదార్ధాల వినియోగన్ని అరికట్టేందుకు ప్రభుత్వ సహకారంతో మానవ హక్కుల సంఘం కూడా ఉంటుందని అన్నారు . ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం మహిళా విభాగాన్ని ఆయన ఎంపిక చేసి ప్రకటించారు . జిల్లా చైర్మన్ గా మాదినేని లక్ష్మి , అధ్యక్షురాలిగా దామ స్వరూప ,కార్యదర్శిగా చింతల సుజాత ను ఎంపిక చేయడంతో పాటు దక్షిణ భారత దేశ కమిటీ కూడా ప్రకటించారు . దక్షిణ భారత దేశ చైర్మన్ గా కనకబండి విజయలక్ష్మి , వైస్ చైర్మన్ గా పరిమి అనంతలక్ష్మి , సహాయ కార్యదర్శి గా కనగంటి నాగమణి , రాష్ట్ర చైర్మన్ గా చావా శాంతి , సహాయ కార్యదర్శిగా మాలోజి ప్రేమ కుమారి లను ఎంపిక చేశారు నూతనంగా ఎంపికైన మహిళా సంఘం నేతలు మాట్లాడుతూ మాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా తనపర భేదాలు లేకుండా ఎల్లప్పుడూ దేశంలో జరుగుతున్న అన్యాయాలపై , మహిళపై జరుగుతున్న దాడులపై పోరాడుతామని తెలిపారు.

Join WhatsApp

Join Now