సంగారెడ్డి/నారాయణఖేడ్, జనవరి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): యువత క్రీడలో రాణించాలని, క్రీడలు శరీర దారుణ్యానికి దోహదం చేస్తాయని బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ రాజ్ శేరికార్ తెలిపారు. నారాయణఖేడ్ థెహసిల్ గ్రౌండ్ లో జరుగుతున్న మోదీ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా గెలుపొందిన క్రీడాకారులకు బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ రాజ్ శేరికార్ బహుమతులు అందజేశారు. శనివారం ఫ్రెండ్స్ డెవిలోపర్స్ నారాయణఖేడ్ మరియు వినయ్ ఫ్లవర్ డెకరేషన్ నారాయణఖేడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో వినయ్ ఫ్లవర్స్ టీమ్ గెలుపొందడంతో శ్రీకాంత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఆర్గనైజింగ్ టీమ్ సభ్యులు అరుణ్ రాజ్ శేరికార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
యువత క్రీడలో రాణించాలి: బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ రాజ్
Published On: January 11, 2025 10:02 pm