పసుపు బోర్డు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు: బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్‌రాజ్ శేరికార్

సంగారెడ్డి/నారాయణఖేడ్, జనవరి 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు మంజూరు చేసిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్‌రాజ్ శేరికార్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ రైతుల కష్టాలు తీర్చడానికి పసుపు బోర్డును తెచ్చి ఆనంద పరవశంలో నింపిన నరేంద్ర మోదీ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించడానికి బిజెపి పార్టీ ప్రజల తరపున కష్ట పడుతుందని చెప్పడానికి నిదర్శనం ఈ పసుపు బోర్డు అని అరుణ్‌రాజ్ తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తెచ్చారని, కొందరు నారాయణఖేడ్ ప్రజల అభివృద్ధిని ఇష్టపడని నాయకులు ఈ పరిశ్రమను పెట్టకుండా ప్రజలకు  అన్యాయం చేశారని అరుణ్ రాజ్ శేరికార్ అన్నారు.

Join WhatsApp

Join Now