కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలు భద్రరావు మృతి

నివాళులర్పించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబరు 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలు భద్రరావు పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు నిబద్దత కలిగిన భద్రరావు మృతి పార్టీకి తీరని లోటని, పార్టీకి ఎన్నో ఏళ్లుగా ఆయన నిస్వార్ధ సేవలందించారన్నారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు,వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, మండే శ్రీను, లింగానాయక్, రవీందర్ మరియు జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు భద్రరావు కు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment