వికలాంగులపై అనుచిత వాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాజంపేట మండల వికలాంగుల హక్కుల పోరాట సమితీ నాయకులు గజ్జెల రాజు డిమాండ్ చేశారు. గురువారం ఇందులో వార్తతో మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో దివ్వాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అంటు ఆమె చేసిన వాఖ్యలు సరి కాదని ఓక సీనియర్ అధికారి దివ్వాంగులపై మాట్లాడడం సరికాదని అన్నారు. వికలాంగులకు దైర్యం నింపాల్సిన అధికారి అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని, వభుత్వం వికలాంగులకు ఎంతో అండగా ఉందని ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు దివ్యాంగులపై చేస్తున్న వాఖ్యలు సరికావని డిప్యూటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మాజీ మంత్రులు సబర్వాల్ మాటలను తప్పు పట్టారని అయిన మళ్ళీ స్వరం వణుకుతున్నా… నిజమే మాట్లాడండి అంటు మరోసారి చేసిన వెంటనే వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేకుంటే వికలాంగుల సంఘం అద్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు..