సంగారెడ్డి/వట్ పల్లి, డిసెంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): వట్ పల్లి మండలం కేరూర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌గా పెద్దపట్ల కార్తీక్ గౌడ్, ఉప సర్పంచ్‌గా చినెల్లి రాములు ప్రమాణ స్వీకారం చేశారు. వార్డు సభ్యులుగా శిరీషా చెన్న గౌడ్, చినెల్లి రాములు, చినెల్లి చంద్రయ్య, బర్గు మంజుల ఆదివయ్య, తలారి లక్ష్మి, చిన్నపట్ల కృష్ణ గౌడ్, చినెల్లి పాపయ్య, బుర్రెగళ్ల కవిత కడులూరి మల్లేశం, బర్గు ఆదివయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సమిష్టిగా పని చేస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
కేరూర్ గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్దపట్ల కార్తీక్ గౌడ్
Oplus_16908288