బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సంచలన నిర్ణయం ద్వారా 50% రిజర్వేషన్ సీలింగ్ (కోటా పరిమితి) ను సడలించడాన్ని టార్గెట్ చేస్తోంది. ఈ దిశగా ప్రత్యేక జీవో (గవర్నమెంట్ ఆర్డర్) జారీ చేయడానికి సిద్ధం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ను ప్రత్యేక జీవో ద్వారా అమలు చేయనుంది.
పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285(A) కు సవరణ:
పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285(A) లో సవరణలు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణతో బీసీ వర్గాలకు పంచాయతీ రాజ్ ఎన్నికలలో అధిక రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుంది. ఈ సవరణ ద్వారా, బీసీ వర్గాలు ప్రాతినిధ్యం పెంచుకొని, వారికి మరింత స్థానం, అధిక అవకాశాలు కల్పించడానికి మద్దతు లభిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం 50% సీలింగ్‌ను సడలించేందుకు చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే నిమిత్తం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనితో, రిజర్వేషన్ల కోటా పరిమితిని నెమ్మదిగా పెంచవచ్చు. ప్రస్తుతం దేశంలో ఉన్న 50% రిజర్వేషన్ సీలింగ్ (పరిమితి) ను తొలగించడం ద్వారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరిన్ని అవకాశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించకపోవడం:
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆర్డినెన్స్ కు ఆమోదం లభించకపోవడంతో, జీవో (గవర్నమెంట్ ఆర్డర్) ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో ద్వారా, కొత్త రిజర్వేషన్ విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. ఈ జీవో కోసం ప్రభుత్వ ఆమోదం ఇప్పటికే సిద్దం అవుతోంది. ఈ జీవో అమలు చేయడం ద్వారా, తెలంగాణలో బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, పంచాయతీ ఎన్నికలలో మరింత ప్రాతినిధ్యం ఉంటుంది…