ఎస్సీ సంచార జాతుల కు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాజకీయాల్లో ప్రత్యేక హోదా కల్పించాలి.

కార్పొరేషన్
Headlines
  1. “తెలంగాణలో ఎస్సీ సంచార జాతుల కోసం సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి”
  2. “డక్కలి కులాన్ని సంచార జాతుల్లో చేర్చాలని డిమాండ్”
  3. “తెలంగాణలో ఎస్సీ సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ ప్రకటించాలి”
  4. “సంచార జాతుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోరిన డక్కలి సంఘం”
  5. “స్వాతంత్రం తరువాత ఎస్సీ జాతులకు నిర్లక్ష్యం: ప్రత్యేక హోదా మరియు రిజర్వేషన్ అవసరం”
ఖమ్మం : డక్కలి కుల రాష్ట్ర ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం హైదరాబాద్ నాగోల్ లో గౌరవ అధ్యక్షులు బాణాల మంగేష్ ఆధ్వర్యంలో జరిగింది . ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీ.సీ సంచార జాతుల ( BC MBCS ) వ్యవస్థాపక అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు ఒంటెద్దు నరేందర్ , “మనం” ఫౌండర్ మరియు రాష్ట్ర అధ్యక్షులు అయిన కటికం నర్సింగరావు లు హాజరయ్యారు . వీరితో పాటు ఖమ్మం నుంచి డక్కలి సంఘం రాష్ట్ర నాయకులు కర్నె రామారావు పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 57 ఉపకులాల్లో ఎస్.సి లో కూడా సంచార జాతులున్నాయి . కర్ణాటకలో ఎస్సీ సంచారజాతుల సపరేట్ కార్పొరేషన్ ఉన్నదో అదే విధంగా తెలంగాణలో కూడా ఎస్సీ సంచార జాతుల సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని , డక్కలి కులాన్ని సంచార జాతుల్లో చేర్చాలని , ఎస్.సి సంచార జాతులకు ఎస్.సి వర్గీకరణలో సపరేట్ కేటగిరి చేసి , సపరేట్ రిజర్వేషన్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు . స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కనీసం చట్ట సభలో మాకు అవకాశం లేకుండా ఎస్సీ లోని రెండు కులాలే అనుభవిస్తున్నాయి . ఇకనైనా ప్రభుత్వాలు గుర్తించి మాలాంటి నిరుపేద కులాలకు తక్షణమే నామినేట్ పోస్టులు కల్పించాలని , రాబోయే గ్రామపంచాయతీ ఎలక్షన్లో ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించిన వారికి ప్రత్యేక కోటాను కల్పించి , గ్రామ సర్పంచులు గా అవకాశం కల్పించాలి రాజధాని నడిబొడ్లున ఆత్మగౌరభవనం ఏర్పాటు చేయాలని అన్నారు . ఈ కార్యక్రమంలో నాయకులు మేకల గోపాల్ , కర్నే మంజుల , బాణాల శీను , హుస్సేన్ , మహంకాళి అశోక్ , అంతోని వెంకన్న , పి రఘు , బాణాల మొగిలి , జంపన్న , బాణాల సాలమ్మ , కర్ణ మహేందర్ , కర్ణ ముత్యాలు , అల్లం రాజమౌళి , రాములమ్మ , అంతోని సురేష్ , గౌరార్ రవి , మహంకాళి సురేష్ తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now