Site icon PRASHNA AYUDHAM

సెప్టెంబర్ 1 మహాధర్నా విజయవంతం చేయాలి – పి ఆర్ టి యు పిలుపు 

IMG 20250814 WA0350

సెప్టెంబర్ 1 మహాధర్నా విజయవంతం చేయాలి – పి ఆర్ టి యు పిలుపు

 

సిపిఎస్ విధానం రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా అధ్యక్షుడు కుశాల్ స్పష్టం

 

ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్

 

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కోర్టు తీర్పు, 57 మెమో ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

 

ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు వేల సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరుకావాలని పిలుపు

 

ఏఐఎఫ్టీవో సెక్రటరీ జనరల్ సిఎల్ రోజ్, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులు

 

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 14

 

 

 

సెప్టెంబర్ 1న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరగబోయే సిపిఎస్ రద్దు మహాధర్నాను విజయవంతం చేయాలని పి ఆర్ టి యు టిఎస్ జిల్లా అధ్యక్షుడు అల్లాపూర్ కుశాల్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

సీపీఎస్ ఉద్యోగ–ఉపాధ్యాయుల పాలిట శాపమైందని, ఇది రద్దు అయ్యేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పు, కేంద్రం జారీ చేసిన 57 మెమో ప్రకారం వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు.

 

సెప్టెంబర్ 1 మహాధర్నాలో ఏ ఐ ఎఫ్ టి ఓ సెక్రటరీ జనరల్ సిఎల్ రోజ్, ఎంమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. జిల్లాలోని పిఆర్టియు ఉపాధ్యాయులు వేల సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి బలమైన సందేశం ఇవ్వాలని కుశాల్ పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంలో కామారెడ్డి పి ఆర్ టి యూ కార్యాలయంలో మహాధర్నా గోడపత్రాలను టీజీ ఇ జేఏసీ జిల్లా చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి, సెక్రటరీ జనరల్ సాయిరెడ్డి, టీజీవో –టి ఎన్ జి ఓ ప్రతినిధులు ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర–జిల్లా బాధ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version