మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘనం గా నివాళులర్పించి శేరి సతీష్ రెడ్డి
పిజేఆర్ సేవలు మరవలేనివి
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 28: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్ పల్లి నియోజకవర్గ లోని మూసపేట్ గుడ్ సెట్ రోడ్ లోని కర్కపెంటన్న ఆధ్వర్యంలో
కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్ రెడ్డి (పిజెఆర్) 17వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఖైరతాబాద్ నియోజకవర్గ నుండి ఐదుసార్లు పి.జనార్దన్ రెడ్డి (పిజేఆర్) ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఆయన చేసిన సేవలు అభివృద్ధి పనులు మరవలేనివని ఆయన గుర్తు చేశారు, పిజెఆర్ ఆశయాలు యువతకు ఆదర్శం అని ఆయన అన్నారు, కార్మిక నాయకుడిగా మంచి గుర్తింపు పొందారని దానికి తోడు తన రాజకీయ జీవితం ఆదర్శంగా నిలిచారని చెప్పారు, ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ స్మరించుకున్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్క పెంటన్న, సంజీవరావు, సునీల్ యాదవ్, కర్క నాగరాజు, లక్ష్మీనారాయణ, నజీర్ బాయ్, రేష్మ, జెర్రిపాటి రాజు, సోను, అలీ భాయ్, ముస్తఫా, శ్రీధర్ చారి, బాబురావు, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు, జావేద్ భాయ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.