Site icon PRASHNA AYUDHAM

సేవాగుణమే మానవత్వానికి ప్రతీక

IMG 20251224 WA0295

సేవాగుణమే మానవత్వానికి ప్రతీక

ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్ సి డిసెంబర్ 24.

నిజామాబాద్ సేవా గుణమే మానవత్వానికి ప్రతీక అని విద్యార్థులలో ఈ సుగుణాన్ని నిక్షిప్తం చేయడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం యొక్క బాధ్యత అని లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్ అన్నారు. ఆయన బుధవారం నాడు సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి, హైదరాబాద్ తన వంతు బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సేవ చేస్తూ వారికి సేవాగుణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. పోశన్న మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లోని ప్రముఖులంతా ఉన్నత స్థాయికి ఎదిగి తమ శక్తి మేర సంస్థ ద్వారా అర్హులకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. లయన్స్ క్లబ్ ద్వారా జి.ఆర్. సుజాత సూర్యరాజ్ దంపతులు చేస్తున్న సేవలు పాఠశాలల కనీస అవసరాలు తీరుస్తున్నాయని, వారి సేవల ద్వారా లబ్ధిపొందిన తమ విద్యార్థులు సమాజంలో ఎదిగి ముందు తరాలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రముఖదాత జి.ఆర్. సూర్యరాజ్ మాట్లాడుతూ అర్హులకు సేవ చేయడం వల్ల మనసుకు సంతృప్తి కలుగుతుందని, ఇంకా దీనివల్ల ఇది సాధ్యం కాదని ఆయన సోదాహరణంగా విద్యార్థులకు వివరించారు. ప్రముఖకవి ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్న లయన్స్ సంస్థ సేవారంగంలో అగ్రపథంలో దూసుకుపోతుందని, లయన్స్ సభ్యులు ఆకాంక్షించిన విధంగా తమ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలలో స్థిరపడి వారి బాటలో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు జి. ఆర్. సుజాత సూర్యరాజ్, మర్రి ప్రవీణ్, విజయలక్ష్మి , రామ్ శాస్త్రి, హైదరాబాద్ లయన్స్ సంస్కృతి అధ్యక్షురాలు సుష్మ, లయన్ వెంకట్, లయన్ డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తదితరులు పాల్గొని విద్యార్థులకు స్కూలు బ్యాగులను బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాలకు పదివేల రూపాయల విలువగల గ్రీన్ కార్పెట్లను డొనేట్ చేసిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు శ్రీలతను లయన్స్ క్లబ్ ఘనంగా సత్కరించింది. చౌదరి చరణ్ సింగ్ జన్మదినం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సారంగాపూర్ కు చెందిన రైతులు యాదేశ్, సాయిలు, రాజ్ గణేశ్ , వెంకట్,  కే. సాయిలు లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ. పోశన్న,  ఉపాధ్యాయులు కె. లలిత, డి. గోపాల్, ఘనపురం దేవేందర్,  డాక్టర్ సుంకరి గంగాధర్, మహమ్మద్ జావిద్ హుస్సేన్, చిలక విద్యాసాగర్, కృష్ణ రాజు,  శ్రీలత, ఏ. లలిత, సుజాత, సునంద తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version