పెద్ద గుజ్జల్ తాండలో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు
కామారెడ్డి జిల్లా గాంధారి
(ప్రశ్న ఆయుధం) జూన్ 26
గాంధారి మండలం పెద్ద గుజ్జుల్ గ్రామం నందు ప్రజలంతా ఏకమై, చందాల రూపంలో ఆ గ్రామ రక్షణకై 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది . సి సి కెమెరాలను ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ రావు, ముఖ్యఅతిథిగా వచ్చి పెద్ద గుజుల్ తండాకి వచ్చి ఏర్పాటుచేసిన సిసి కెమెరాలు ఓపెన్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నందు సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు, మరియు గ్రామస్తులు వసంత్,హేమ్ సింగ్, దేవి సింగ్, సవాయ్ మరియు తదితరులు పాల్గొన్నారు