సేవాదళ్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలి ఎమ్మెల్యే జారె

సేవాదళ్
Headlines :
  • సేవాదళ్: ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలి – ఎమ్మెల్యే జారె
  • సేవాదళ్ యువతలో సేవా భావం పెంపొందించాలి: ఎమ్మెల్యే జారె
  • ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేలా సేవాదళ్ కార్యాచరణ రూపొందించాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి నవంబర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేవాదళ్ జిల్లా స్థాయి సమావేశం దమ్మపేట వినాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు సేవాదళ్ మరింత ముందుకు తీసుకెల్లాలని ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందిస్తూ. ప్రజలకు ప్రభుత్వానికి సేవాదళ్ వారధిగా నిలవాలన్నారు. 1978లో ఏర్పాటైన సేవాదళ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందని ఈ సంస్థ యువతలో సేవా భావం పెంపొందేలా పనిచేస్తుందన్నారు. అనేక సామాజిక కార్యకలాపాలు నిర్వహించటం విద్య ఆరోగ్యం సామాన్య ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడానికి సేవాదళ్ పాత్ర చాలా కీలకమైంది అన్నారు.సేవాదళ్ అనేది ఒక సంస్థ మాత్రమే కాకుండా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక ఆయుధంలా పనిచేస్తుందని సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వీకరించేలా చేసి సమ సమాజం వైపుగా అడుగులు వేసేలా ప్రేరేపిస్తుందని తెలిపారు. సేవాదళ్ సంస్థను స్థాపించిన ఆనాటి పెద్దలను స్మరించుకుంటూ వారి ఆశయాలను నిలబెట్టాలని సేవాదళ్ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోదుమూరి దయాకర్, జిల్లా అధ్యక్షులు కేశ బోయిన నరసింహారావు,జిల్లా కార్యదర్శి కొదమురి కోటేశ్వరరావు, నియోజవర్గ అధ్యక్షులు బండారు మహేష్,నియోజవర్గ ప్రధాన కార్యదర్శి పజిల్ బక్షి ,మరియు నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సేవాదళ్ మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now