లక్ష్మీదేవి పల్లి సేవాలాల్ సేన మండల అధ్యక్షులుగా బోడ బాలు నాయక్
ప్రశ్న ఆయుధం 31జులై కామారెడ్డి :
లక్ష్మీదేవి పల్లి మండలం కేంద్రంలో సేవాలాల్ సేన సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి లు లావుడియా వెంకటేష్ నాయక్; గుగులోతు బద్రు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ పాల్గొన్నారు. వారు ఈ కార్యక్రమని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని మండల కమిటీలను నియమించాలన్న వారి పిలుపు మేరకు
లక్ష్మీదేవి పల్లి మండల కేంద్రంలో మండల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది
మండల అధ్యక్షులుగా బోడ బాలు నాయక్ ;ఉపాధ్యక్షులుగా బోడ రవి నాయక్ ప్రధాన కార్యదర్శిగా మాలోత్ రాజు నాయక్ ; అధికార ప్రతినిధిగా రమేష్ నాయక్ నియమించడం జరిగింది అనంతరం వారికి నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది త్వరలోనే పూర్తిస్థాయి మండల కమిటీని ప్రకటిస్తామని అన్నారు తేదీ 9-8-2024 శుక్రవారం నాడు హైదరాబాద్ సరూర్ నగర్ లో బాబు జాగ్జీవన్ రామ్ భవన్ లో సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను జిల్లా కమిటీ నాయకులు మరియు మండల కమిటీ నాయకులు అలాగే అనుబంధ కమిటీ నాయకులు శ్రేయోభిలాషులు, మేధావులు, విద్యావంతులు, మహిళలు కళాకారులు గురువులు జాతి మనుగడ సాధనె లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమసిద్ధమై అధిక సంఖ్యలో పాల్గొని సేవలాల్ సేన రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర మహాసభ కరపత్రాలను విడుదల చేశారు 10% గిరిజన రిజర్వేషన్ పెంపు జీవో నెంబర్ 33 కు చట్టబద్ధత కల్పించాలని అన్ని రంగాల్లో అమలు చేయాలని అలాగే ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించి కొనసాగించాలి. నూతనంగా ఏర్పడ్డ తండా గ్రామపంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలి తండా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ గిరిజన లంబాడీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సమస్యలపై కొట్లాడే సంఘం సేవాలాల్ సేన అని అన్నారు గిరిజన సమస్యల పరిష్కార సాధనకై సేవాలాల్ సేన ఎల్లప్పుడూ వెంట ఉంటదని అన్నారు
మండల అధ్యక్షులు బోడ బాలు నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు బంజారా జాతి ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోరాటం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధికార ప్రతినిధి బానోత్ నాగరాజు నాయక్, రాజు రవి ఫుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు