Site icon PRASHNA AYUDHAM

ముందస్తు అక్రమ అరెస్టులపై మండిపడ్డ సేవాలాల్ సేన

అక్రమ
Headlines in Telugu
  1. “ముందస్తు అరెస్టులపై మండిపడ్డ సేవాలాల్ సేన నాయకులు”
  2. “గిరిజన రైతుల భూముల జోలికి వస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక”
  3. “రాజకీయ కుట్రలు ఆపకుంటే మంత్రి ఇళ్ల ముట్టడి: సేవాలాల్ సేన”
  4. “కోడంగల్ గిరిజన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్”
  5. “గిరిజన భూములపై తప్పుడు చర్యలు: సేవాలాల్ సేన నుండి హెచ్చరిక”

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర ఇంచార్జ్ కి వినతి పత్రం ఇవ్వాలని సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ప్రకటిస్తే జిల్లాలలో ఉన్న సేవాలాల్ సేన నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం చాలా సిగ్గుచేటని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం లోని గిరిజన ప్రాంతాల భూములను లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వం కుట్రను తిప్పి కొడతాం అని అన్నారు వ్యవసాయ చేసుకొని బతికే గిరిజన రైతుల భూముల జోలికి వస్తే సేవాలాల్ సేన ఉద్యమిస్తదని అన్నారు ఫార్మా కంపెనీ పేర్లతో అగ్రవర్ణాల భూములు పక్కనపెట్టి అమాయక ప్రజల గిరిజన లంబాడ భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు ఈ గొడవలకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ గొడవలు వెంటనే ఆగిపోతాయి కానీ రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల తదితర గ్రామ గిరిజన రైతుల జోలికి వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే ఈ గొడవలు అన్నీ కూడా వెంటనే సద్దు మనుగుతాయని ఆయన అన్నారు అలా కాకుండా గిరిజన రైతులపై రాజకీయం చేయాలని చూస్తే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు వెంటనే భేషరతుగా రాష్ట్రంలో సేవాలాల్ సేన ముందస్తు అక్రమ అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Exit mobile version