ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 26, (ప్రశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో రోడ్డు పక్కన గుంతలలో నిలిచిన నీరు స్థానికుల జీవనానికి తీవ్రమైన ఇబ్బందులు సృష్టిస్తోంది. నిలిచిన నీటి కారణంగా సీసీ రోడ్లకు నష్టం జరుగుతూ, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదనంగా, దోమల వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురి అవ్వటం తో పాటు, విష సర్పాలు, క్రిమి కీటకాలు ఇల్లల్లోకి చేరుతూ ప్రజల భద్రతకు, ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి.
స్థానికులు ఎల్లారెడ్డి మున్సిపల్ కమీషనర్ కు విన్నతిపత్రం అందిస్తూ, “నిలిచిన నీటి కారణంగా రోడ్డు ధ్వంసం, పరిసరాల దుర్గంధం, క్రిమి కీటకాల వ్యాప్తి వంటి సమస్యలు రోజు రోజుకు పెరుగటంతో సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ప్రజల ఆందోళన తీవ్రమైన నేపథ్యంలో, సమస్య పరిష్కారం ఆలస్యం అయితే పెద్ద మొత్తంలో ఫిర్యాదులు, సమూహ నిరసనలు చోటు చేసుకోవచ్చని స్థానికులు హెచ్చరిస్తున్నారు. స్థానికులు అధికారుల నుండి తక్షణమే ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నారు.