జమ్మికుంట,ఘనంగా ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*ఘనంగా ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

*జమ్మికుంట, డిసెంబర్ 28 ప్రశ్న ఆయుధం:*

ఎస్ఎఫ్ఐ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షుడు శౌర్యతేజ స్వాతంత్రం ప్రజాస్వామ్య సోషలిజం జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా గజ్జెల శ్రీకాంత్ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 1970లో ఏర్పడి అనేక విద్య రంగ సమస్యల పైన అలుపెరుగని పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన ఘనత ఎస్ఎఫ్ఐ ది అని గుర్తు చేశారు. ఈ 55వ ఆవిర్భ దినోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనము అములు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు ఎస్ఎఫ్ఐ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నిరంతరం విద్యారంగ సమస్యల పైన పోరాటంకు సన్నద్ధమవుతామని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి చరణ్, చరణ్ తరుణ్, వంశి, మహేష్, వినయ్ తదితర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now