విద్యార్థి ఉద్యమాల రథసారథి ఎస్ ఎఫ్ ఐ 

విద్యార్థి ఉద్యమాల రథసారథి ఎస్ ఎఫ్ ఐ

ఘనంగా ఎస్ ఎఫ్ ఐ 55 వ ఆవిర్భావ దినోత్సవం

ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్

సిద్దిపేట డిసెంబర్ 30 ప్రశ్న ఆయుధం :

విద్యార్థి ఉద్యమాల పోరాటాల, వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అని సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ అన్నారు. సోమవారం రోజున ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ 55 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లా కమిటీ పట్టణ కమిటీ నాయకత్వం సభ్యులు హాజరై స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే నినాదంతో ఉన్న జెండాను జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970 లో డిసెంబర్ నెలలో ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం లో ఏర్పడిందన్నారు. విద్యార్థుల సమస్య లే లక్ష్యంగా ఎన్నో విజయాలు సాధిస్తూ పోరాటాలను కొనసాగిస్తూ ఈ భారత దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘం గా అవతరించిందన్నారు. నాటి నుండి నేటివరకు విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.

Join WhatsApp

Join Now