విద్యార్థుల ప్రతిభ ను వెళ్లకితీయడం కోసం ఎస్ఎఫ్ఐ చేసే కార్యక్రమం అభినందనీయం
–
– ప్రముఖ న్యాయవాది కె సిద్ధిరాములు , కామారెడ్డి పట్టణ ఎస్సై బాల్ రెడ్డి
– ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభ పరీక్ష
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో గల శ్రీ సాందీపని జూనియర్ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)ఆధ్వర్యంలో ఆదివారం 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించరు. ఈ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ప్రముఖ న్యాయవాది కే సిద్ధ రాములు, పట్టణ ఎస్సై బాల్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించడం కోసం ఎస్ఎఫ్ఐ ఇలాంటి ప్రతిభా పరీక్షలు పెట్టడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ప్రతిభా పరీక్షలు వల్ల విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన ఎంతగానో పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మొదటిసారి పదవ తరగతి విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నా విద్యార్థిని, విద్యార్థులు ఈ పరీక్ష రాయడం వల్ల అవగాహన పెరుగుతుందని అన్నారు. ఇలాంటి ప్రతిభా పరీక్షలు భవిష్యత్తులో ఎవరు నిర్వహించిన విద్యార్థులు పాల్గొవాలని కోరారు. అదేవిధంగా పరీక్షల పట్ల విద్యార్థులకు ఉన్న భయాందోళనలు ఇలాంటి పరీక్షల వల్ల వెళ్ళిపోతాయని కావున ఇలాంటి ప్రతిభా పరీక్షలను కచ్చితంగా విద్యార్థులు వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఏ పరీక్ష కు హాజీరైన 20 నిమిషాల ముందే హాజీరై హలల్లో కూర్చుంటే అక్కడ ఉన్న పరిస్థితులు అవగాహన కలిగి భయం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ అజయ్, ఎం అరుణ్, సాందీపని కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా, రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాహుల్, నితిన్, మణికంఠ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.