Headlines :
-
కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యల కోసం ఎస్ఎఫ్ఐ సిద్దిపేట నిరసన
-
ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం: ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహం
-
కార్పొరేట్ విద్యాసంస్థల అన్యాయాలపై ఎస్ఎఫ్ఐ ఉద్యమం
-
ఆత్మహత్యలు నివారించండి: కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు కోరుతున్న ఎస్ఎఫ్ఐ
కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభి
సిద్దిపేట డిసెంబర్ 7 ప్రశ్న ఆయుధం :
రాష్ట్రంలో అనేకమంది విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలలో సూసైడ్ చేసుకున్న ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు వెంటనే ఇంటర్మీడియట్ బోర్డ్ చర్యలు కార్పొరేట్ విద్యా సంస్థలపై ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యుడుకోనేరు ప్రవీణ్ మరియు సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అనేకమంది విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలలో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది గత ఐదు నెలల గడువులోనే అనేక మంది విద్యార్థులు మరణించారు ఇంతవరకు ఇంటర్మీడియట్ బోర్డు ఏమి చేస్తుందని వారు అన్నారు వెంటనే ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని అన్నారు లేని పక్షాన సిద్దిపేట పట్టణంలో గాని జిల్లాలో గాని అనేక నిరసనలు చేస్తామని వారు హెచ్చరించారు దాదాపు పది మంది విద్యార్థులు మరణించిన ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం మన రాష్ట్రంలో సిగ్గుచేటు గా అనిపిస్తుందని వారు అన్నారు. తక్షణమే ఇంటర్మీడియట్ బోర్డు కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు లేని పక్షాన ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కమిటీ అనేక ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని అలానే రానున్న రోజులలో ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి ఆఫీసులో ముట్టడివ్వా డానికి కూడా వెనుకాడ మని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను మరియు పట్టణ నాయకులు సంతు, అజయ్, నవదీప్ , సాయి కుమారు తదితరులు పాల్గొన్నారు.