Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ

IMG 20260101 192127

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ

హైదరాబాద్‌లో సీఎం నివాసంలో మర్యాదపూర్వక భేటీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి  ప్రశ్న ఆయుధం 

హైదరాబాద్, జనవరి 1 (2026): 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గురువారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సంక్షిప్తంగా చర్చ జరిగినట్లు తెలిసింది. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని షబ్బీర్ అలీ ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Exit mobile version