Site icon PRASHNA AYUDHAM

నూతన సర్పంచులకు షబ్బీర్ అలీ అభినందనలు

IMG 20251220 152757

నూతన సర్పంచులకు షబ్బీర్ అలీ అభినందనలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20:

నూతనంగా ఎన్నికైన సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు అభినందించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు హైదరాబాద్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజఖాన్‌పేట్ గ్రామానికి చెందిన లావణ్య రాజ్‌కుమార్, రత్నగిరిపల్లి గ్రామ సర్పంచ్ అనిల్, ఇస్సానపల్లి గ్రామ సర్పంచ్ రాములు, సోమారంపేట్ గ్రామ సర్పంచ్ మమతా రమేష్‌రెడ్డి, బంజేపల్లి గ్రామానికి చెందిన బి. మన్సింగ్, లచ్చపేట గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, నెమలి గుట్ట తండా సర్పంచ్ షీలా రవి కుమార్‌లు ఈ సందర్భంగా శ్రీ షబ్బీర్ అలీ గారిని కలిసి అభినందనలు స్వీకరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని షబ్బీర్ అలీ సూచించారు. ప్రజల ఆశలను నెరవేర్చేలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పాలన సాగించాలని నూతన సర్పంచులకు హితవు పలికారు.       ఈ సందర్భంగా సర్పంచులు తమకు అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

Exit mobile version