రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చిన షబ్బీర్ అలీ 

ప్రజాపాలనలో పేదోడి సొంతింటి కల సాకారం

రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చిన షబ్బీర్ అలీ

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్

కామారెడ్డి/బీబీపేట్,మే:17 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత్ జోడో పాదయాత్రలో భాగంగా ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన మాట నెరవేర్చడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో అకాల వర్షాల వల్ల బిక్కునూరు లక్ష్మి, చిట్యాల రాజమణిల కూలిన ఇండ్లను అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చూసి చలించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారన్నారు ఎన్నికల్లో భాగంగా పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి మాట నిలబెట్టుకుని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా ఇండ్లకు భూమి పూజ చేయడం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని ప్రజాపాలనకు ఇదే నిదర్శనమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని పేదోడి సొంతింటి కల సాకారమవుతుందని నిరూపించారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు

Join WhatsApp

Join Now