సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఉపశమనం కలిగిస్తుందని షబ్బీర్ అలీ
బాధిత కుటుంబాలకు రూ.30 లక్షల చెక్కుల పంపిణీ
ప్రజల సంక్షేమం నా ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు వ్యాఖ్య
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 13
అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిజమైన ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం మంజూరుచేసిన రూ.30 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, పేదలకు అండగా ఉంటూ, ఆస్పత్రి బిల్లులతో ఇబ్బందులు పడే వారికి ప్రభుత్వం తరఫున సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. ప్రజల సంక్షేమం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.