బీహార్ ఎన్నికల్లో కిసాన్‌గంజ్‌లో కాంగ్రెస్‌కు మద్దతుగా షబ్బీర్ అలీ
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కమ్రుల్ హుడా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) నవంబర్ 1
పట్నా: బీహార్ ఎన్నికల వేళ కిసాన్‌గంజ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమ్రుల్ హుడా గారి తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సమానత్వం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ ప్రజల మద్దతు కాంగ్రెస్‌కు లభిస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.