ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన షబ్బీర్ అలీ
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు , కొత్త రేషన్ కార్డులు అర్హులకు త్వరలోనే అందజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం అన్నారు.
రుణమాఫీ చేసి చూపించాం, రైతు భరోసా అందిస్తున్నాం , మహిళలకు ఉచిత బస్సు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ,200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు, రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.