డీసీసీ అధ్యక్షుడి మార్పు షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా అక్టోబర్ 14
తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించడంలో తనదంటూ ప్రత్యేక పాత్ర పోషించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కైలాస్ శ్రీనివాసరావును డిసిసి అధ్యక్షులుగా నియమించాలని నియోజకవర్గ కార్యకర్తలు కోరడంతో తిరిగి కైలాస శ్రీనివాసరావును మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం కల్పించిన తర్వాతనే ఆయనను మారుస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక కోసం కామరెడ్డి లోని ఆర్ అండ్ బి అతిధి గృహ ఆవరణలో కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సంఘటన సృజన్ అభియాన్ దేశవ్యాప్త కార్యక్రమం అని ఇది పార్టీని పటిష్టం చేయడానికి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి పదవులు అర్హులైన వారికి ఇవ్వడానికి అని పేర్కొన్నారు.
జిల్లాలోని ప్రతి నియోజకవర్గ, మున్సిపాలిటీ, వార్డులు సందర్శనతో అట్ట అడుగున ఉన్నటువంటి కార్యకర్తలను సంప్రదించిన తర్వాతనే కొత్త అధ్యక్షులు నియమిస్తామని ఏఐసిసి పరిశీలకుడు రాజ్ పాల్ కరోల అన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు,మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు,తమ అభిప్రాయాన్ని స్వీకరించారు. అనంతరం డిసిసి అధ్యక్షునిగా కైలాస్ శ్రీనివాసరావును ఎన్నిక చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా రాజ్ పాల్ కరోల మాట్లాడుతూ కులం మతం సంబంధం లేకుండా సమాజంలో అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్య లక్షణంగా చేసుకొని అందర్నీ కలుపుకొని పోయే సిద్ధాంతం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అది అంటారు. ఈ అధ్యక్షుని ఎన్నికల ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని తమ పర్యటన తర్వాత ఖరారు చేయుటలో రాష్ట్ర నాయకత్వానీకి నివేదికలో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.