నగరంలో పుట్ పాత్ ల పై నిద్రిస్తున్న నిరాశ్రయ నిర్వాసితులకు నీడ కల్పించాలి

నగరంలో పుట్ పాత్ ల పై నిద్రిస్తున్న నిరాశ్రయ నిర్వాసితులకు నీడ కల్పించాలని

తక్షణమే బెడ్ షిట్ లు పంపిణి చెసి చలి నరకం నుండి కాపాడండి.

ప్రజావాణి లో డిబిఎఫ్ విన్నపం

సిద్దిపేట నవంబర్ 29 ప్రశ్నయుగం :

రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగరం లో వేలాది మందికి రాత్రి పూట షెల్టర్ లేకపోవడంతో పుట్ పాత్ ల పై నిద్రిస్తున్న నిరాశ్రయుల కు నీడ కల్పించాలని దళిత బహుజన ఫ్రంట్ విన్నవించారు. శుక్రవారం మహత్మ పూలే ప్రజా భవన్ లో ప్రజావాణి ఒఎస్డి దివ్వ దెవరాజన్ కలిసి డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన వినతి పత్రం సమర్పించి చర్చించారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన మాట్లాడుతూ స్వంత గ్రామాలలో పని లేక నగరం లో ఎదొ ఒక పని చెసుకుంటు రాత్రి పూట నిద్రపొయెందుకు షెల్టర్ లేక నగర రొడ్ల పై ,పూట్ పాత్ ల పై మెట్రో రైలు బ్రిడ్జిల కింద నిద్రిస్తున్నారన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషను ,ఎస్.డి రోడ్,మధర్ ధెరిస్సా,కిస్ హైస్కూల్, బేగంపేట, బంజారాహిల్స్ లోని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఇలా చాల ప్రాంతాలలో పుట్ పాత్ ల పై,ఖాళీ స్ధలాలు,రొడ్ల పై,వివిధ పార్క్ ల వద్ద బండల పై బహిరంగ ప్రదేశాలలో నిద్రిస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళ నిరాశ్రాయులు నరకయాతన ను అనుభవిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఇటివల జిహెచ్ యంసి రొడ్ల పై చెసిన సర్వే తొమ్మిది వెల వరకు నిరాశ్రయులు వున్నట్లు తెలిందన్నారు. సందు లలో పక్కాగా సర్వే చెస్తే వాస్తవ లెక్కలు బయ పడుతాయి అని అన్నారు. ప్రస్తుతం చలి రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇండ్లళ్ళ లో వున్న వారె గజగజ వణుకుతుంటె ఇక బహిరంగ ప్రదేశాలలో నిద్రిస్తు నరకాన్ని చవి చూస్తున్న వారి సంగతి మాటలలో చెప్పలేమన్నారు. 

జిహెచ్ యంసి ,వివిధ స్వచ్చంద సంస్దలు నిర్వహిస్తున్న నగరంలో కేవలం 11 షెల్టర్ లు మాత్రమే వున్నాయి. ఇందులో 8 పురుషులకు, 3 మహిళలకు వున్నాయని ఇవి చాల తక్కువ గా వుండటం తో నిరశ్రాయులకు సరిపొకపొవడంతో రొడ్డె దిక్కవుతుందన్నారు..షెల్డర్ ల సంఖ్య పెంచాలని,నగరం లోని రద్ది ప్రాంతాలలో లెబర్ అడ్డాలలో ఒపెన్ షెల్టర్ లను వసతులతో కూడిన తాత్కాలికంగా షెల్టర్ లను,మొబైల్ టాయిలెట్స్ ను నిర్మించాలని కొరారు. గతంలో జి హెచ్ యం సి నిరాశ్రయ నిర్వాసితులకు దుప్పట్లు పంపణి చెస్తుండెది కాని గత కొన్ని సంవత్సరాలు గా దుప్పట్ల పంపిణి ని మరిచిపొవడంతో నిరాశ్రయులు దిక్కులేని పక్షులు గా మారారన్నారు. వెంటనే దుప్పట్ల ను పంపిణి చెయాలని కోరారు. ఇందుకు స్పందించిన ప్రజావాణి ఒఎస్డి దివ్య దెవరాజన్ జిహెచ్ యం సి కమిషనర్ తో మాట్లాడుతనని హమి ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment