నీ ఆశలే ఫలించగా.. ధ్వనించు విజయభేరి.
ఎమ్మెల్యే శంకర్” కలల సౌదానికి శ్రీకారం..
షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శ్రీకారం.
చక చకా సాగుతున్న భవన నిర్మాణ పనులు
ఎమ్మెల్యే ఆశలు ఫలించు తరుణం ఆసన్నమైంది.. తాను చదువుకున్న కళాశాలను పునర్నిర్మించి షాద్ నగర్ రాజకీయ చరిత్రలో పేదల విద్యాచక్రాన్ని తిప్పేందుకు వీర్లపల్లి శంకర్ సిద్ధమయ్యారు. ఆదివారం షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కళాశాల భవన నిర్మాణానికి పునాది తీసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, భీష్మ కిష్టయ్య, ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన గావించిన ఎమ్మెల్యే శంకర్.. తాజాగా భవన నిర్మాణానికి పునాది కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జెసిబి వాహనాలకు ఆయన కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆలోచనత్మకంగా అన్ని తరాలు గుర్తుపెట్టుకునే విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి అందజేసే విధంగా కృషి చేస్తున్నారు. దాదాపు 8 నుండి 10 కోట్ల ప్రాజెక్టు ఇది. అన్ని వసతులతో అంగరంగ వైభవంగా విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఎంతోమంది తన అనుచరులు అభిమానులు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు జర్నలిస్టులు అందరి సహకారంతో కలిసి ఈ భవన నిర్మాణానికి ఆయన ముందడుగు వేశారు. తాజాగా జూనియర్ కళాశాల ఖాళీ స్థలంలో కళాశాల భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. ఈరోజు పునాది వేసేందుకు పనులు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చెంది తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, రఘు, ఇద్రిస్, బాలరాజు గౌడ్, ముబారక్, అగ్గనూర్ బస్వం, మాజీ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, మహమ్మద్ ఇబ్రహీం, కుమార్, అన్వర్, కౌన్సిలర్ సర్వర్ పాష, సయ్యద్ ఖదీర్, లింగారెడ్డిగూడెం అశోక్, సీతారాం తదితరులు పాల్గొన్నారు…