స్థానిక ఎమ్మెల్యే ఎందుకు రారు..? శంకరమ్మ ఆవేదన

*స్థానిక ఎమ్మెల్యే ఎందుకు రారు..శంకరమ్మ ఆవేదన*

-మోత్కూరు మండలం పొడిచేడులో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సభ*

వర్ధంతి సభ నిర్వహించిన తల్లిదండ్రులు శంకరమ్మ, వెంకటాచారి*

–హాజరైన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి*

–శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన విప్ బీర్ల* 

సభకు హాజరుకాని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్*

*–సభకు రావాలని ఆహ్వానించినా ఎమ్మెల్యే రాలేదని తల్లి శంకరమ్మ ఆవేదన*

–ఆత్మ బలిదానం చేసుకున్న ఈ ప్రాంత బిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆక్రందన*

-పదవులు అయిదేళ్లలో ఉంటయ్.. పోతయ్ కానీ శ్రీకాంతాచారి త్యాగం జీవితకాలం సువర్ణాక్షరాలతో లిఖించదగింది*

శ్రీకాంతాచారి కుటుంబం కోసమో, భార్య పిల్లల కోసమో ప్రాణ త్యాగం చేయలే..4 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండు*

*-సామేల్ అన్న నీ సీటుకేమైన అడ్డొచ్చానా..ఎవరి మాటలో పట్టుకుని సభకు రాలే*

*50 వేల ఓట్లతో గెలిచిన నువ్వు ఏ ఒక్క వర్గానికో పనిచేయడం కాదు.. అందరిని కలుపుకొని పనిచేయాలి*

*–నా బిడ్డ త్యాగంతోనే ఏర్పడ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సామేల్ కు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు*

–శ్రీకాంత్ ఆచారి చనిపోయిన రోజు ఎంత ఏడ్చానో స్థానిక ఎమ్మెల్యేగా మీరు సభకు రాకుండా అవమానించడంతో అంతకన్న ఎక్కువగా బాధపడుతున్న*–ఈ అవమానాలన్నింటిని చూస్తుంటే పొడిచేడు తుంగతుర్తి లో ఎందుకుందన్న బాధ కలుగుతోంది*

నేను వస్తా అని చెప్పిన ఎమ్మెల్యే అయిలన్న రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది*

–గతేడాది ఇదే రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా శ్రీకాంత్ చారికి అంకితమిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా తల్లిగా నాకెంతో ఆనందం కలిగింది*

–అయినా నేటికీ నా బిడ్డ త్యాగాన్ని గాని, మా కుటుంబాన్ని సీఎం, మంత్రులు పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన కలిగిస్తోంది*

–మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లి శ్రీకాంతాచారి వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహించాలి*

*–సీఎం రేవంత్ రెడ్డి పొడిచేడు గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి*

–ఆ తర్వాత ప్రభుత్వ విప్ అయిలయ్య, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సామేల్ ఉదయం ఫోన్ చేసి అందరం కలిసి వెళదామన్నారు. అత్యవసర పని కారణంగా రాలేకపోయారు*

–శ్రీకాంత్ చారి త్యాగాన్ని తెలంగాణ చరిత్రలో ఎవరూ చెరిపేది కాదు*

*–శ్రీకాంత్ చారి త్యాగం, మీ కుటుంబంపై ఎవరికి ఎలాంటి వివక్ష ఉండదు*

*–ఒకసారి అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని మంత్రులు, సీఎం వద్దకు తీసుకెళతానని శంకరమ్మకు హామీ ఇచ్చిన ప్రభుత్వ విప్ అయిలయ్య*

Join WhatsApp

Join Now

Leave a Comment