*లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శంకరపట్నం డిప్యూటీ తహసిల్దార్..*
*హుజురాబాద్ డిసెంబర్ 28 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా శంకరపట్నం
మండలం డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం రూ.6000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నాలా కన్వెన్షన్ కోసం మండలంలోని ఎరడపల్లికి గ్రామానికి చెందిన ఓ రైతు నాలా కన్వర్షన్ అనుమతులు కోరగా మల్లేశం లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు శనివారం ఏసీబీ డీ ఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తహశీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పూర్తి విచారణ అనంతరం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచనున్నట్లు ఏసీబీ డి ఎస్పి రమణమూర్తి తెలిపారు.