ప్రభుత్వ సలహాదారులుగా షరీఫ్, చాగంటి
57 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంజబితా విడుదల.
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ (మైనార్టీ అఫైర్స్), ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్)ను నియమించనుంది. వీరితో పాటు 59 నామినేటేడ్ పదవులకు సంబంధించిన జాబితా శనివారం విడుదలైంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. వీటిల్లో 57 కార్పొరేషన్ల చైర్మన్ల పేర్లు ఉన్నాయి. 49 టిడిపికి, 9 జనసేనకు, బిజెపికి ఒకటి చొప్పున కేటాయింపులు జరిగాయి. టిడిపికి చెందిన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని అగ్రికల్చర్ మిషన్ చైర్మన్‌గా నియమించారు. ఇదే పార్టీకి చెందిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్‌కు, ఎపి బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌గా నీలాయపాలెం విజయకుమార్, జి కోటేశ్వరవును గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా, ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ ఆధారిటీ చైర్మన్‌గా ఆనం వెంకట రమణారెడ్డి, ఫైబర్‌నెట్ చైర్మన్‌గా జివి రెడ్డి, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావకు ఎపి వైద్య సేవా మౌళిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపిక చేశారు.