Site icon PRASHNA AYUDHAM

జగన్ మౌనానికి అర్థం మోదీకి మద్దతు ఇవ్వడమేనా?: షర్మిల

IMG 20250323 WA0124

జగన్ మౌనానికి అర్థం మోదీకి మద్దతు ఇవ్వడమేనా?: షర్మిల

డీలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల మండిపాటు

పరోక్షంగా జగన్ డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తున్నట్టేనని వ్యాఖ్య

డీలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడాలని డిమాండ్

తన అన్న, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ పై జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని… ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడమేనా? అని ఆమె ప్రశ్నించారు. జగన్ మౌనంగా ఉన్నారంటే… పరోక్షంగా డీలిమిటేషన్ కు మద్దతు ఇచ్చినట్టేనని అన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఏపీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు.

డీలిమిటేషన్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మౌనం వహించడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. డీలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి టీడీపీ, జనసేన, వైసీపీ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరారు.

Exit mobile version