విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగిన షర్మిల
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా
తన కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ షర్మిల ఫైర్
నాయకుడిగా జగన్ ఓడిపోయారని విమర్శ
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇదే సమయంలో ఆయనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన కుటుంబం, తన పిల్లలపై విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు.
విజయసాయిరెడ్డి వైసీపీని వీడటం చిన్న విషయం కాదని షర్మిల అన్నారు. వీసా రెడ్డి వంటి నాయకులే జగన్ ను వదిలేస్తున్నారంటే… పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. నాయకుడిగా జగన్ ఓడిపోయారని అన్నారు. విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు జగన్ అని అన్నారు.