Site icon PRASHNA AYUDHAM

ఆమె ప్రసవ వేదన అనుభవిస్తూ నీకు జన్మనిచ్చింది కదా అందుకు ఆమెకు నీవు కట్టే వెల ఎంత

అమ్మ__ప్రేమ

 

ఆమె ప్రసవ వేదన అనుభవిస్తూ నీకు జన్మనిచ్చింది కదా అందుకు ఆమెకు నీవు కట్టే వెల ఎంత?

నీకు బుడిబుది నడకలు నేర్పింది కదా అందుకు ఆమెకు ఎంత వెలకడుద్దాము?

 

నీ కడుపు నింపడానికి చందమామ కథలు చెప్పి తన కడుపు కాల్చుకున్నందుకు ఎంత వెల కడుద్దాము?

 

ఆమె చెమట చేతుల్తో నిన్ను

ముద్దాడినందుకు ఆ తల్లికి ఎంత వెల కడుద్దాం?

 

చీకటైతే నీ రాక కోసం

ఆమె ఊగిసలాడుతూ నా కోడుకెక్కడ

అని వెతుకులాట కోసం నీవు కట్టగాలిగే వాడివే కదా ఆ తల్లికి ఎంత వెల కట్టగాలవు?

 

ఆ తల్లి కళ్ళుతెరల నిండా నీ కోసం

తిరగాడుతుంటే ఆ తల్లికి నీవు కట్టే వెల ఎంత?

 

నీ బుడిబుడి పలకరింపులు ఆ తల్లి గుండెకూ నువిచ్చే ఆనందపు మమకారాన్ని మాత్రమే ఆమెకు ఇచ్చే బహుమతి నీకు నిజంగానే అమ్మ అంటే అర్థం తెలిస్తే ఈ క్షణంమే ఓసారి ఆమెను ప్రేమతో పలకరించి చూడు నీ ఆరోగ్యం జాగ్రత అనీ బదులు ఇస్తుంది…

Exit mobile version