Site icon PRASHNA AYUDHAM

తాడ్వాయి జూనియర్ కాలేజీలో షీ టీమ్ అవగాహన సదస్సు  

IMG 20251017 WA0213

తాడ్వాయి జూనియర్ కాలేజీలో షీ టీమ్ అవగాహన సదస్సు

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి, (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 17:

 

తాడ్వాయి జూనియర్ కాలేజీలో మహిళల భద్రత, చట్టపరమైన అవగాహనపై షీ టీమ్, ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నేడు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి DSP కార్యాలయం నుండి షీ టీమ్ ఇంచార్జి సుప్రజ, శ్రీ శైలం, పాల్గొని విద్యార్థినీ, విద్యార్థులకు మహిళా భద్రత, సోషల్ మీడియా వినియోగం, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, హెల్ప్‌లైన్ 100 & 181 వినియోగంపై విపులంగా వివరించారు.

కార్యక్రమంలో తాడ్వాయి పోలీస్ స్టేషన్ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ యూసఫ్ హుస్సేన్,, NSS ఇన్‌ఛార్జి శ్రీకాంత్, అధ్యాపక బృందం, నాన్ టీచింగ్ సిబ్బంది, పాల్గొన్నారు.

విద్యార్థులు ఆసక్తిగా స్పందిస్తూ, ప్రశ్నలు అడగగా, అధికారులు సమాధానమిస్తూ మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

> “యువత సామాజిక మార్పుకు మూలస్తంభం. అవగాహనతోనే సమాజం భద్రంగా ఉంటుంది,” అని షీ టీమ్ ఇంచార్జి సుప్రజ పేర్కొన్నారు.

Exit mobile version