ఆల్ ఇండియా మైనారిటీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా షేక్ ఎజాజ్ పాషా

సంగారెడ్డి, అక్టోబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని బీసీ,ఎస్సీ, ఎస్టీ, ఆల్ ఇండియా మైనారిటీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా షేక్ ఎజాజ్ పాషా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా కొత్త విజయ భాస్కర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త విజయ భాస్కర్ ఎజాజ్ పాషాకు నియామక పత్రం అందించారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరన్న గూడెం గ్రామం షేక్ ఎజాజ్ పాషా స్వస్థలం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ఆల్ ఇండియా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొత్త విజయ భాస్కర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటానని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నీతి నిజాయితీగా పని చేస్తానని పేర్కొన్నారు. సంక్షేమ అభివృద్ధి, వారి హక్కుల సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ నియామకం జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, కొమరం భీమ్, అబ్దుల్ కలాం వంటి కానీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని అన్నారు. ఆశయాలు సమాజంలో సమానత్వం, న్యాయం, అభివృద్ధిని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. షేక్ ఎజాజ్ పాషా నాయకత్వంలో సంగారెడ్డి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబడతారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment