షేక్ ముజ్మిల్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించిన మేయర్

షేక్ ముజ్మిల్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించిన మేయర్

ప్రశ్న ఆయుధం జనవరి 20: కూకట్‌పల్లి ప్రతినిధి

గత నెల్లో ఫతేనగర్ డివిజన్ నాలాలో కొట్టుకుపోయి మృతి చెందిన షేక్ ముజ్మిల్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. రూ. రెండు లక్షల రూపాయల చెక్కును మేయర్ విజయలక్ష్మి సోమవారం తన కార్యాలయంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి ముజ్మిల్ తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ హలీం బేగం లకు అందజేశారు. బండి రమేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ ధన సహాయం అందేలా చేశారు. దీంతో హుస్సేన్ దంపతులు బండి రమేష్ కి మేయర్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, అయాజ్, కుక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now