ప్రశ్నయుధం న్యూస్ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 22
దమ్మపేట మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి చెకుముఖి టాలెంట్ టెస్ట్ లో షేక్ నాసియా టీం ఇంగ్లీష్ మీడియం లో మండల స్థాయిలో ప్రథమ స్థానం గెలుపొంది సత్తా చాటారు. టీంలో పాల్గొన్న ఎండి సుహానా, వేద వర్షిత ప్రథమ స్థానంలో బహుమతులు అందుకోని చదువుతున్న పాఠశాలలు వన్నెతెచ్చారు. ఈ క్రమంలో ఇంగ్లీష్ డిక్షనరీ, సర్టిఫికెట్లను గెలుపొందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు అందజేశారు. ఈ దశలోనే తెలుగు మీడియంలో చెకుముఖి టాలెంట్ టెస్టులో పాల్గొన్న పి యశ్వంత,పదవ తరగతి, వైశాలి ఎనిమిదో తరగతి, మహేశ్వరి,తొమ్మిదవ తరగతి విద్యార్థులు ప్రథమ స్థానంలో ప్రధమ బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించి. భవిష్యత్తులో అన్ని రంగాలలో ముందుకు రాణించాలని సూచించారు.