ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన.నోడల్ అధికారి షేక్ సలాం..

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం ..

IMG 20240827 WA0092

కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం  బాన్సువాడ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేయడం జరిగింది.నూతనంగా బదిలీపై వచ్చిన ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్ తో కలిసి కళాశాలలోని తరగతి గదులను పరిశీలించడం జరిగింది..తదనంతరం కళాశాల అధ్యాపక బృందంతో మీటింగ్ ఏర్పాటు చేశారు…. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం  మాట్లాడుతూ… విద్యార్థినులకు చక్కటి విద్యను అందించాలని, అడ్మిషన్ల తేదీని పెంచడం జరిగింది కావున కళాశాలలో అడ్మిషన్లు ఇంకా పెంచే విధంగా కృషి చేయాలని అలాగే విద్యార్థులకు మంచి ఉత్తమ ర్యాంకులు సాధించే విధంగా కృషి చేయాలని అధ్యాపకులను కోరారు… ఇప్పటివరకు కళాశాలకు అకాడమిక్ పరంగా కానీ క్రమశిక్షణ పరంగా కానీ మంచి పేరు ఉంది కావున అది ఇలాగే కొనసాగాలని నూతన ప్రిన్సిపాల్ అసద్ ఫారుక్ ని కోరడం జరిగింది… ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు..కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్ ,కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now