మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 27: కూకట్‌పల్లి ప్రతినిధి
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు.
మన రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన మహానుభావుడు ఆయన అని పేర్కొన్నారు. దేశానికి సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన నాయకులు అతను తన జ్ఞానం మరియు భారతదేశ ఆర్థిక అభివృద్ధికి చేసిన అమూల్యమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు అన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి సంజీవరావు, లక్ష్మీనారాయణ, రేష్మ, రాజా ముదిరాజ్, శ్రీధర్ చారి, బాబురావు, రామకృష్ణారెడ్డి, సూరిబాబు, దుర్గా, మరియు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.