మొహరం పండగలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే
ప్రశ్న ఆయుధం 06 జూలై ( బాన్సువాడ ప్రతినిధి )
జుక్కల్ మండల కేంద్రంలో నిర్వహించిన మొహరం పండగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కులామతాలకు అతీతంగా జరుపుకోనే పండగ మొహరం అన్నారు.త్యాగానికి ప్రతీక అని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు జుక్కల్ బిఆర్ఎస్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు నీలు పటేల్, మాజీ ఉప సర్పంచ్ బాను గౌడ్,మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, వశ్రే రమేష్ పటేల్, తాటి బుమన్న, కిరణ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.