జయనగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకురాలు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన
శిరీష సత్తూర్
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 25: కూకట్‌పల్లి ప్రతినిధి
స్థానిక 124 డివిజన్ జయనగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకురాలు, సమైక్య ప్రెసిడెంట్ దేవి నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ శేరి లింగంపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ యొక్క ఉన్నతమైన భావాలను సంబోధిస్తూ జరిగిన ఈ వేడుకలలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దేవి ని అభినందించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.