శ్రీశైలం అడవుల్లో దారి తప్పిన శివ స్వాములు

*శ్రీశైలం అడవుల్లో దారి తప్పిన శివ స్వాములు*

నంద్యాల జిల్లా:ఫిబ్రవరి 22

గూగుల్ మ్యాప్ ను అనుస రిస్తూ ముందుకెళ్తుంటారు. తద్వారా షార్ట్ కట్ మార్గా లను, ట్రాఫిక్ తక్కువగా ఉన్నదారులను ఎంచుకుం టారు. అయితే, కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ ను అను సరిస్తూ వెళ్లిన వారు దారి తప్పి అనేక ఇబ్బందులను ఎదుర్కొని మృతి చెందిన ఘటన కూడా ఉన్నాయి.

తాజాగా… గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు అడవిలో తప్పిపోయారు. తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్, నియోజక వర్గంలోని,పెంట వెల్లి గ్రామానికి చెందిన 7 గురు శివస్వాములు శుక్రవా రం ఉదయం పాదయాత్ర ద్వారా శ్రీశైలం బయలు దేరారు.

వారు గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ ముందుకు సాగారు. అయితే, వెళ్లాల్సిన దారిలో కాకుండా మరో మార్గంలో వెళ్లడంతో వారు శుక్రవారం సాయం త్రం 4:00 ప్రాంతంలోవారు దారి తప్పిపోయారు. సాయంత్రానికి దారితప్పిన విషయాన్ని గుర్తించిన శివ స్వాములు భయాందోళ నకు గురయ్యారు. దీంతో సెల్ ఫోన్ ద్వారా 100 కు ఫోన్ చేశారు.

నంద్యాల జిల్లా ఎస్పీ స్పందించి వారిని సురక్షి తంగా బయటకు తీసుకొ చ్చేందుకు అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది శివస్వాముల కోసం వెతుకు లాట ప్రారంభించారు. చివరికి శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో వారిని గుర్తించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో నుంచి బయటకు తీసుకొచ్చారు.

వెంటనే స్పందించిన పోలీస్, అటవీ శాఖ అధికారుల సమయ స్ఫూర్తికి, శివ స్వాములు, స్థానికులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తు న్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment