ముట్రాజ్ పల్లి లో ఘనంగా శివాజీ విగ్రహావిష్కరణ

ముట్రాజ్ పల్లి లో ఘనంగా శివాజీ విగ్రహావిష్కరణ

గజ్వేల్, 19 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ముట్రాజ్ పల్లి గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, తాజా మాజీ కౌన్సిలర్ శ్యామల మల్లేశం, బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి, మనోహర్ యాదవ్, నందు పంతులు మాట్లాడుతూ ముట్రాజ్ పల్లి లో చత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, చత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ మహారాజ్ అని అన్నారు. అనంతరం శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ దాత వేమూరి ఆంజనేయులు గౌడ్ కు, విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, గజ్వేల్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నాగమున్నయ్య, బుక్క రమేష్, నాయిని సందీప్, మర్కంటి ఏగొండ, కాశమైన సందీప్, ముట్రాజ్ పల్లి యువకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now