– రామాలయం నుంచి శివాజీ విగ్రహం వరకు భారీ ర్యాలీ
– చత్రపతి శివాజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు పయనించాలి
– చత్రపతి శివాజీ యువతకు స్ఫూర్తి
గజ్వేల్, 19 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుధవారం చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్, హైందవ సోదరుల ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక రామాలయం నుంచి శివాజీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అందరికీ చత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు భారతదేశ ముద్దుబిడ్డ చత్రపతి శివాజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు పయనించాలని, అఖండ భారత సామ్రాజ్యమే లక్ష్యంగా మొగల్ చక్రవర్తులను ఎదిరించి పోరాడిన యోధులు చత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతిరూపమని, శివాజీ యువతకు స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, హైందవ సోదరులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.