ధర్మ పరిరక్షణకు ప్రతీక చత్రపతి శివాజీ మహారాజ్

ధర్మ పరిరక్షణకు ప్రతీక చత్రపతి శివాజీ మహారాజ్

– గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

గజ్వేల్, 19 ఫిబ్రవరి 2025 : ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ శత్రువుల గుండెల్లో నిద్రించినట్లు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్ లో జరిగిన చత్రపతి శివాజీ మహారాజ్ జయంత్యోత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ మరాఠా యోధులు, కోట్లాది మంది భారతీయుల ఆరాధ్య దైవంగా నిలిచిన ఆయన అన్ని వర్గాలను ప్రేమించినట్లు గుర్తు చేశారు. ముఖ్యంగా మొగలుల రాజ్యంపై దండెత్తిన శివాజీ తన ముఖ్య అనుచరులుగా, ప్రధాన పదవుల్లో ముస్లింలనే నియమించుకోవడం ప్రత్యేకతగా నిలుస్తుందని తెలిపారు. చత్రపతి శివాజీ అన్ని వర్గాల ఆరాధ్య దైవంగా నిలుస్తూ హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసినట్లు చెప్పారు. భారతీయులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో యువత నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మైనార్టీ సెల్ కాంగ్రెస్ జిల్లా నేత సమీర్, శ్రీ అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు డెక్కు శ్రీనివాస్ గుప్తా, నాయకులు సుభాష్ చంద్రబోస్, శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, రాములు గౌడ్, రమేష్ గౌడ్, రాజు గౌడ్, సాంబయ్య గుప్త, డప్పు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now