Site icon PRASHNA AYUDHAM

శివకుమార్ గౌడ్ సామాజిక సేవలు ఎంతో గొప్పవి…..

IMG 20240721 WA0303

●కృషి విజ్ఞాన్ సంస్థ చైర్మన్ రాచకొండ లక్ష్మీకాంతారావు..

●గురుపౌర్ణమి సందర్బంగా పేదలకు శ్రీగురుపీఠం పౌండర్ చైర్మన్ శివకుమార్ గౌడ్ దంపతులు ఆర్థికసాయం..

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

ఎలాంటి లాభపేక్ష లేకుండా, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా చేస్తున్న సామాజిక, ఆధ్యాత్మిక సేవలు ఎంతో గొప్పవని విజ్ఞాన్ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాచకొండ లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం గురుపౌర్ణమి సందర్బంగా శ్రీగురుపీఠంలో నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకలు, స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం శ్రీగురుపీఠం ట్రస్టు ఆధ్వర్యంలో శివకుమార్ గౌడ్ -రమాదేవి దంపతులు ట్రస్టు సభ్యులతో కలిసి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వికలాంగులు నిరుపేద అభాగ్యులు కలిపి 19 మందికి ఆర్థిక సహాయం అందించడం జరిగినది. ఈసందర్బంగా లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ శివకుమార్ గౌడ్ కుటుంబమే ఒక ఆధ్యాత్మికత, సేవా గుణం కలిగిఉన్నటువంటిదని, స్వర్గీయ జిన్నారం పెద్దగౌని లింగయ్య కూడ గతంలో పేదలకు భూములను కూడ దానం చేశారని ఆయన గుర్తుచేశారు. సామజిక సేవా దృక్పధంతో శివకుమార్ గౌడ్ తన సంపాదనలో కొంత నిత్యం పేద ప్రజలను ఆదుకోవడం అలవాటుగా మారిందని ఆయన ప్రసంశించారు. సనాతన ధర్మాన్ని పాటిస్తున్న శివకుమార్ గౌడ్ దంపతులు దత్తాత్రేయస్వామి, షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో శ్రీగురుపీఠం ట్రస్టు, ప్రసాద్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రాజ్యం బిక్షపతి యాదవ్, గొల్ల యాదయ్య, విశ్వశ్రీ లా ఛాంబర్స్ సీఎఓ లిఖిత, నల్లపల్లి శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, కొడకంచి సుదర్శన్ గౌడ్, జంగం వెంకటేష్, బల్కంపేట భాస్కర్, మహేష్ యాదవ్,వజ్జ హన్మంతు, సాయికుమార్, కొంతాన్ పల్లి సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version